: కేసీఆర్ కు గవర్నర్ షాక్


తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరోమారు షాకిచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గం నియామకం విషయంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో నాలుగింటికి ఓకే చెప్పిన గవర్నర్ ఐదు పేర్లను తిరస్కరించారు. దీంతో కేసీఆర్ కు గవర్నర్ గట్టి షాకే ఇచ్చినట్లైంది. చైర్మన్ గా ప్రభుత్వం ప్రతిపాదించిన ఘంటా చక్రపాణి పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గవర్నర్ సభ్యులుగా విఠల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీల పేర్లకూ పచ్చజెండా ఊపారు. అయితే, కేసీఆర్ ప్రతిపాదించిన రంగారావు, చంద్రశేఖరరెడ్డి, దినేశ్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ ల పేర్లను గవర్నర్ తిరస్కరించారు. పూర్తి స్థాయి కార్యవర్గంతో కమిషన్ ను ఏర్పాటు చేద్దామని భావించిన కేసీఆర్, ఊహించని విధంగా గవర్నర్ నుంచి షాక్ చవిచూశారు. అయితే, వెనువెంటనే తేరుకున్న ఆయన చైర్మన్, ముగ్గురు సభ్యులతోనే పాలకవర్గం కొలువుదీరేందుకు పచ్చజెండా ఊపారు.

  • Loading...

More Telugu News