: ఆదిలోనే ఐదో వికెట్ కోల్పోయిన భారత్


బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలి రోజు ఆటలో భారీ స్కోరు దిశగా సాగిన టీమిండియా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన రెండో రోజు ఆట ఆదిలోనే అజింక్యా రహానే వికెట్ ను కోల్పోయింది. 311 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, పది పరుగులు చేయగానే జోష్ హాజెల్ ఉడ్ బౌలింగ్ లో రహానే పెవిలియన్ చేరాడు. మొత్తం 132 బంతులు ఎదుర్కొన్న రహానే 81 పరుగులు చేశాడు. రహానే ఔటవడంతో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 90 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 53 బంతుల్లో 32 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

  • Loading...

More Telugu News