: ఐపీఎల్-8కి 123 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీలు


ఐపీఎల్ ఎనిమిదవ సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఫ్రాంచైజీలు సమర్థులైన ఆటగాళ్లకు చోటిచ్చే క్రమంలో, పాత ఆటగాళ్లను వదిలించుకుంటున్నాయి. తమకు అవసరం అనుకున్న వారిని మాత్రం వదులుకునేందుకు సిద్ధపడడంలేదు. ఈ క్రమంలో 2015 సీజన్ కు గాను మొత్తం 8 జట్లు 123 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. వారిలో 79 మంది భారత క్రికెటర్లు కాగా, మిగిలిన 44 మంది విదేశీ ఆటగాళ్లు. ఈ సీజన్ కు సంబంధించి ఐదుగురు ఆటగాళ్లను వివిధ ఫ్రాంచైజీలు మార్పిడి చేసుకున్నాయి. తాజా సీజన్ గురించి ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ మాట్లాడుతూ, ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం, వారి కాంట్రాక్టును పొడిగించే హక్కు ఆయా ఫ్రాంచైజీలకు ఉంటుందని తెలిపారు. తద్వారా, జట్లను బలోపేతం చేసుకునే వెసులుబాటు లభిస్తుందని అన్నారు. ఇక, ఆయా జట్ల కాంట్రాక్టు నుంచి విడుదలైన ఆటగాళ్లు వేలానికి తమ పేర్లను ఉంచుకోవచ్చని బిస్వాల్ వివరించారు.

  • Loading...

More Telugu News