: వివాదాలకు చోటు లేకుండా విభజన చట్టాన్ని సవరించాలి: కేకే
ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో సవరణలు తీసుకువస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు స్వాగతించారు. అయితే, ఎలాంటి విభేదాలకు చోటు లేకుండా చట్టంలో సవరణలు జరగాలని సూచించారు. తెలంగాణ రాజ్యసభ ఎంపీలను ఏపీకి మార్చడం వల్ల.... ఎంపీ లాడ్స్ నిధులను ఖర్చు చేసే విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రాజ్యసభ ఎంపీల మార్పుకు సంబంధించి కూడా విభజన చట్టంలో సవరణలు జరగాలని కేకే అన్నారు. విభజన చట్టం సవరణలపై తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.