: పాక్ తాలిబన్ల చర్యను ఖండించిన ఆఫ్ఘన్ తాలిబన్లు
పాకిస్థాన్ లో సైనిక పాఠశాలపై దాడి జరిపిన పాక్ తాలిబన్లు... 141 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిన ఘటన ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఈ దారుణ ఘటన కరడుగట్టిన ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లను కూడా కలచివేసింది. పాక్ తాలిబన్ల చర్యను ఆఫ్ఘన్ తాలిబన్లు తీవ్రంగా ఖండించారు. ఏ దేశంలో అయినా సరే... ఉద్దేశపూర్వకంగా అమాయక ప్రజలు, మహిళలు, చిన్నారులను చంపడం అత్యంత దారుణమని... ఇది పవిత్రమైన ఇస్లాంకు వ్యతిరేకమని... ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఇస్లామిక్ సంస్థ గుర్తుంచుకోవాలని తెలిపారు. పాక్ తాలిబన్లు, ఆఫ్ఘన్ తాలిబన్లు వేర్వేరు సంస్థలైనప్పటికీ... పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఈ రెండు సంస్థలూ సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నాయి. ఈ రెండు సంస్థల లక్ష్యం ఒకటే... దేశంలో ఉన్న ప్రభుత్వ పాలనను అంతమొందించాలి, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి!