: జాతీయ భద్రతా దళాలతో ఒబామా భేటీ... భద్రతపై చర్చ
పాకిస్థాన్ లోని పెషావర్ లో పాక్ తాలిబన్ల నరమేధం నేపథ్యంలో, ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా దళాలతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమావేశమయ్యారు. అమెరికాలో ప్రజల భద్రత, ఏవైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. పాక్ ఉదంతంపై కూడా ఈ భేటీలో చర్చ జరిపారు. ఈ సమావేశానికి యూఎస్ ఉపాధ్యక్షుడు జాయ్ బిడెన్, జాతీయ భద్రత సలహాదారు సుసాన్ రైన్, వివిధ నిఘా సంస్థల అధిపతులు హాజరయ్యారు.