: పక్క పార్టీల వారికి మంత్రి పదవులిస్తున్నారు... టీఆర్ఎస్ లో సమర్థులే లేరా?: నాగం


ఏ చిన్న అవకాశం దొరికినా టీఆర్ఎస్ పై విరుచుకుపడే బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మరోసారి ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పక్క పార్టీల నేతలకు మంత్రి పదవులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా? అంటూ ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీగా అభివర్ణించిన కేసీఆర్... ఇప్పుడు ఆ పార్టీ నేతలకే పిలిచి మరీ మంత్రి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వైఖరిని చూసి తెలంగాణ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News