: గూగుల్ శోధనలో మోదీని మించిన సన్నీ లియోన్


ఈ ఏడాది గూగుల్ ఇండియా శోధనల జాబితా విడుదలైంది. అయితే, ఈసారి రెండు కొత్త విషయాలు తెలిశాయి. ఒకటి, యూజర్లు తాము తెలుసుకోవాల్సిన వాటి గురించి నేరుగా టైప్ చేయకుండా 'యూఆర్ఎల్' అడ్రస్ బార్ ద్వారా వెతుకుతున్నారట. రెండోది, బీజేపీ స్టార్ ప్రచారకర్త, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం ఉన్నప్పటికీ... శృంగార తార సన్నీ లియోన్ గురించే ఇంకా గూగుల్లో వెతుకులాడటం. ఈ క్రమంలో గూగుల్ ఇండియా జాబితాలో మోదీ ద్వితీయ స్థానంలో ఉండగా, బాలీవుడ్ కు దిగుమతైన సన్నీ లియోన్ తొలి స్థానాన్ని ఆక్రమించింది. తరువాత స్థానాల్లో సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్, దీపికా పదుకొనె ఉన్నారు. ఇక, వెబ్ సైట్ కేటగిరీల విషయానికి వస్తే ఐఆర్ సీటీసీ, ఫ్లిఫ్ కార్ట్, ఎస్ బీఐ ఆన్ లైన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News