: బీసీసీఐ సుప్రీంకోర్టుకు అందించిన జాబితాలో గవాస్కర్, గంగూలీ, రవిశాస్త్రి పేర్లు


ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాం నేపథ్యంలో, బీసీసీఐ పదవుల్లో కొనసాగుతూ, వ్యాపారాలు చూసుకుంటున్న మాజీ క్రికెటర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. స్కాంపై విచారణ సందర్భంగా, బీసీసీఐ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తుల జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, లాల్ చంద్ రాజ్ పుత్, వెంకటేశ్ ప్రసాద్ ఉన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తుల జాబితాను సమర్పించాలంటూ మంగళవారం నాటి విచారణలో సుప్రీంకోర్టు బీసీసీఐని ఆదేశించింది. ఈ మేరకు బోర్డు జాబితాను బుధవారం కోర్టుకు అందించింది.

  • Loading...

More Telugu News