: పెషావర్ దుర్ఘటన మృతులకు పార్లమెంట్ సంతాపం


పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన దాడిలో మరణించిన వారికి పార్లమెంట్ సంతాపం తెలిపింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే లోక్ సభ, రాజ్యసభల్లో పెషావర్ దుర్ఘటనను సభ్యులు ఖండించారు. ఈ మేరకు తీర్మానం చేసిన లోక్ సభ, తాలిబన్ల దాడి క్రూరమైన, పిరికిపంద చర్యగా పేర్కొంది. అనంతరం సభ్యులు, మృతులకు తమ సంతాపం వ్యక్తం చేశారు. నిన్న (మంగళవారం) జరిగిన ఈ ఘటనలో 132 మంది చిన్నారులు చనిపోగా, పలువురు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News