: బెజవాడ ప్రసూతి ఆసుపత్రిలో కామినేని ఆకస్మిక తనిఖీ
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నేటి ఉదయం విజయవాడలోని ప్రసూతి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మంత్రి తనిఖీలకు వచ్చిన సమయానికి చాలా మంది వైద్యులు ఇంకా విధులకు రాలేదు. దీంతో, వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆలస్యంగా విధులకు హాజరైతే ఎలాగంటూ వారిని అక్కడికక్కడే నిలదీశారు. అంతేగాక, సమయపాలన పాటించని పలువురు వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు.