: రాష్ట్ర విభజన చట్టానికి, ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధం లేదు: వెంకయ్యనాయుడు


రాష్ట్ర పునర్విభజన చట్టానికి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి అంశానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని చెప్పిన ఆయన, వాటిపై కొందరు నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి విషయాన్ని జాతీయ అభివృద్ధి మండలి చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు, శాసనమండలి సభ్యుల విభజనలోనూ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సమస్యలున్నాయని చెప్పిన వెంకయ్య, వాటి పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News