: అమీర్ ఖాన్ 'పీకే' వీక్షించిన సచిన్, రాజ్ థాకరే
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే'ను క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఎంఎన్ఎస్ పార్టీ అధినేత రాజ్ థాకరే వీక్షించారు. గత రాత్రి ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో అమీర్, ఆయన భార్య కిరణ్ రావు, నటి అనుష్క శర్మ, పలువురు స్నేహితులు కూడా సినిమాను చూశారు. ఈ నెల 19న దేశవ్యాప్తంగా 5,200 స్క్రీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా అందరూ చూసేందుకు వీలుగా, టికెట్ రేటును పెంచకూడదని 'పీకే' యూనిట్ నిర్ణయించింది.