: రెండో టెస్టులో మురళీ విజయ్ శతకం


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ మురళీ విజయ్ శతకం సాధించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 99 పరుగుల వద్ద అవుటై సెంచరీ చేజార్చుకున్న మురళీ విజయ్, నేడు సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తయ్యేదాకా నింపాదిగా బ్యాటింగ్ చేసిన విజయ్, సెంచరీ పూర్తి కాగానే జూలు విదిల్చాడు. ఇప్పటిదాకా 193 బంతులను ఎదుర్కొన్న విజయ్ 123 పరుగులు చేశాడు. మరోవైపు, భారత స్కోరు 200 పరుగుల మార్కును దాటింది. 62 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్లకు 213 పరుగులు చేసింది. విజయ్ తో జతకలిసిన అజింక్యా రహానే 49 బంతుల్లో 25 పరుగులు రాబట్టాడు.

  • Loading...

More Telugu News