: హైదరాబాద్ లో ఐదుగురు చైన్ స్నాచర్ల అరెస్ట్... 6 కిలోల బంగారు నగల స్వాధీనం
మహిళల మెడల్లోని నగలను క్షణాల్లో తస్కరించి మాయమయ్యే చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేటి ఉదయం నగరంలో ఐదుగురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 6 కిలోల మేర బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారందరూ నగరంలో పేరుమోసిన గొలుసు దొంగలేనని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో చైన్ స్నాచర్లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ అరెస్టుతో పోలీసులు దాదాపుగా 228 కేసులను ఛేదించినట్లు తెలుస్తోంది.