: కుర్చీలు, వస్తువులపై నోబెల్ గ్రహీతల సంతకాలు... అదే ఆ మ్యూజియం ప్రత్యేకత!


ఆ మ్యూజియంలోని వస్తువులు ప్రముఖ వ్యక్తుల సంతకాలతో చాలా విలువైనవిగా మారిపోయాయి. అదే స్టాక్ హోమ్ లోని నోబెల్ మ్యూజియం. 2014కు గానూ నోబెల్ శాంతి బహుమతి పురస్కారం పొందిన బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి ఈ నెల 12న ఆ మ్యూజియంను సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంలోని కేఫ్ బ్రిస్టో లో ఉంచిన కుర్చీపై సంతకం చేశారు. "ఇప్పటికీ ఈ కుర్చీ ఇంకా ఖాళీగానే ఉందని భావిస్తున్నా. అది లక్షల మంది వీధి బాలల కోసం వేచి చూస్తూ, వారిని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది" అంటూ ఆ కుర్చీపై రాశారు. 2009లో నోబెల్ శాంతి పురస్కారం పొందిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆర్థికవేత్త జాన్ నాష్, డీఎన్ ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ సహా దాదాపు 230 మంది ప్రముఖులు సంతకాలు చేసిన వస్తువులను ఆ మ్యూజియంలో ఉంచారు. 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పొందిన ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ సంతకం చేసిన సైకిల్ కూడా ఈ మ్యూజియం కేఫ్ లో కొలువుదీరడం మరో విశేషం.

  • Loading...

More Telugu News