: బ్రిస్బేన్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కొద్దిసేపటి క్రితం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. మురళీ విజయ్ (15), శిఖర్ ధావన్ (5) భారత్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. తొలి టెస్టులో గెలుస్తామనుకున్న మ్యాచ్ ను చేజార్చుకున్న టీమిండియా ఈ టెస్టులోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కాలిగాయం కారణంగా తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్ ఆసిస్ జట్టును ఏ మేరకు ముందుండి నడిపిస్తాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ ధోనీ ఈ టెస్టులో భారత్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 20 పరుగులు చేసింది.