: రేపు భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టు
బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు రేపు ఉదయం ప్రారంభం కానుంది. బ్రిస్బేన్ లో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి టెస్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ స్థానంలో రెగ్యులర్ కెప్టెన్ ధోనీ పగ్గాలు చేపడుతున్నారు. అలాగే, ఆసీస్ కెప్టెన్ క్లార్క్ గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో... అతని స్థానంలో స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బ్రిస్బేన్ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో... భారత బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.