: ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులా? అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయి: నాగం


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఏ టీడీపీ నేతలను ఉద్యమ ద్రోహులుగా కేసీఆర్ అభివర్ణించారో... ఇప్పుడు వారికే పిలిచి మరీ మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. అప్పటి ద్రోహులు ఇప్పుడు కేసీఆర్ కు మిత్రులయ్యారా? అని ప్రశ్నించారు. ఏనాడూ జెండా పట్టని, జై తెలంగాణ అనని నేతలకు ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వడం... తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచినట్టు కాదా? అని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలతో అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని నాగం విమర్శించారు.

  • Loading...

More Telugu News