: సమైక్య ఛాంపియన్లు తుమ్మల, తలసానిలకు మంత్రి పదవులెలా ఇచ్చారు?: పెద్దిరెడ్డి


తెలంగాణ మంత్రివర్గాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తోందని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్ లో అంతా టీడీపీవారే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొంత మంది నేతలు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం తమతోనే ఉన్నారని... రికార్డు స్థాయిలో జరిగిన సభ్యత్వ నమోదుతో ఈ విషయం తేటతెల్లమయిందని అన్నారు. టీడీపీ ఒక ఊట బావిలాంటిదైతే, టీఆర్ఎస్ గంగాళంలాంటిదని చెప్పారు. ఊట బావిలో ఎన్ని బిందెలు తోడినా ఇంకా ఊరుతూనే ఉంటుందని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులంటూ తిట్టినవారికే ఇప్పుడు కేసీఆర్ పిలిచి మరీ మంత్రి పదవులు ఇచ్చారని పెద్దిరెడ్డి విమర్శించారు. టీడీపీలో సమైక్య ఛాంపియన్లుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మంత్రి పదవులిచ్చారని అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని... పచ్చి రాజకీయ పార్టీ అని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News