: కేసీఆర్ పై కేటీఆర్ అలిగారట!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ అలిగారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. కేబినెట్ విస్తరణ విషయంలో తండ్రితో కేటీఆర్ ఏకీభవించలేదని సమాచారం. కొత్తగా మంత్రులయిన ఒకరిద్దరి విషయంలో కేటీఆర్ కు భిన్నాభిప్రాయాలున్నాయని చెబుతున్నారు. వీరిని మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళతాయని కేటీఆర్ భావిస్తున్నారట. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా కేటీఆర్ హాజరు కాలేదు. తండ్రి కేసీఆర్ పై అలగడం వల్లే సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారనే ప్రచారం జరుగుతోంది.