: స్టేడియంలో నీళ్ళెత్తిపోసిన సీనియర్ క్రికెటర్లు
వాళ్ళంతా సీనియర్ క్రికెటర్లు. వారిలో కొందరు ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు కూడా. అయితేనేం, స్టేడియంలో నీళ్ళెత్తిపోశారు. ముంబై, రైల్వేస్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు ఈ ఘటన జరిగింది. వర్షం పడ్డ తరువాత సూపర్ స్లొపర్ పని చేయకపోవడంతో మైదానాన్ని శుభ్రం చేసేందుకు ఆటగాళ్ళు నడుం బిగించారు. ముంబై జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సీనియర్ ఆటగాడు అభిషేక్ నాయర్ లతో పాటు ఏడుగురు ఆటగాళ్ళు తమ షూస్ విప్పి... స్పాంజ్, బకెట్లను చేతబట్టి మైదానంలో నీళ్ళు తోడారు. కాగా, అంతకుముందు మ్యాచ్ లో జమ్ముూ కాశ్మీర్ చేతిలో పరాజయం తరువాత రైల్వేస్ పై విజయం సాధించి తీరాలన్న కసితో ఉన్న ముంబై జట్టు, స్టేడియంను త్వరగా సిద్ధం చేయాలని ఇలా స్వయంగా రంగంలోకి దిగిందట.