: కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పాటిల్ కు గుండెపోటు


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పాటిల్ కు యాంజియోగ్రఫీ నిర్వహించామని, ప్రస్తుతం ఆయన క్షేమమేనని డాక్టర్ బీ.కే.గోయల్ తెలిపారు. కాగా, గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తరువాత పాటిల్ ను ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడి వైద్యులు ప్రత్యేక మసాజ్ చేసి ఆయనకు ఊపిరి పోశారు. ఆయనను ఐసీయూలో ఉంచి పరీక్షిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పాటిల్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News