: తాలిబన్ల దాడిని 'జాతీయ విషాదం'గా పేర్కొన్న షరీఫ్
పాకిస్థాన్ లోని కీలక నగరం పెషావర్ లోని స్థానిక పాఠశాలపై తాలిబన్ల దాడిని 'జాతీయ విషాదం'గా ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడి విషయం తెలుసుకున్న వెంటనే పెషావర్ కు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. "ఈ ఘటన దేశానికే విషాదం. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. దగ్గరుండి సైనికుల ఆపరేషన్ ను నేను పర్యవేక్షిస్తా. వాళ్లంతా నా ఆర్మీ పిల్లలు, ఇది నాకు కలిగిన నష్టమే" అని పేర్కొన్నారు.