: బ్యాంకు దోపిడీలో తొలి అనుమానం సిబ్బంది పైనే!


ఈ తెల్లవారుజామున హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని ఫెడరల్ బ్యాంకులో జరిగిన చోరీలో తొలుత సిబ్బందిని విచారిస్తున్నామని డీసీపీ రమారాజేశ్వరి వెల్లడించారు. విచారణలో భాగంగా బ్యాంకుకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. బ్యాంక్ లోని రెండు లాకర్లను మాత్రమే దుండగులు తెరిచారని, ఒక వ్యక్తి మాత్రమే లోపలకు చొరబడినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలనలో గుర్తించామని వివరించారు. కాగా, ఫెడ్ బ్యాంకులో చోరీకి వచ్చిన దుండగులు గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించారు. మొత్తం కేజీ బంగారం, రూ.1.25 లక్షల నగదు చోరీ చేశారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News