: ఈసారి లక్నోలో ఆప్ ఫండ్ రైజింగ్ డిన్నర్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో ప్రత్యేకంగా భోజనం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈసారి ఈ కార్యక్రమాన్ని లక్నోలో నిర్వహించబోతోంది. ఈ నెల 27న వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలతో ఈ ఫండ్ రైజింగ్ డిన్నర్ ను ఏర్పాటు చేసింది. 'ఏఏపీ థాలీ' పేరుతో ప్లేటు భోజనం రూ.11,000గా నిర్ణయించింది. ఈసారి కార్యక్రమానికి కేజ్రీ సన్నిహిత సహచరుడు మనీష్ శిశోడియా, అతనితో పాటు పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్, అశుతోష్ ప్రాతినిథ్యం వహిస్తారు.

  • Loading...

More Telugu News