: జనవరి నుంచి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు


కొత్త సంవత్సరంలో తాము మార్కెటింగ్ చేస్తున్న అన్ని మోడల్ కార్ల ధరలను పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 2015 నుంచి మోడల్‌ను బట్టి ధరల పెంపు రూ.5,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుందని కంపెనీ వివరించింది. ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయ విపణిలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ కారు ఇయాన్ మొదలుకొని ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకు విభిన్న వాహనాలను విక్రయిస్తోంది. భారత మార్కెట్లో వీటి ధరలు రూ.2.87 లక్షల నుంచి రూ.28.41 లక్షల మధ్య ఉన్నాయి. వాహన మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో ఉండటం, రూపాయి విలువ క్షీణత కారణంగా పెరిగిన దిగుమతి సుంకాలు, ఉత్పత్తి వ్యయం రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని హ్యుందాయ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News