: ఇరు రాష్ట్రాల్లో కలిపి 40 లక్షలు దాటిన టీడీపీ సభ్యత్వం


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి తెలుగుదేశం సభ్యత్వం 40 లక్షలు దాటిందని టీడీపీ నేత కళా వెంకట్రావు తెలిపారు. అమెరికాను కాపాడేందుకు 42 లక్షల మంది సైన్యం ఉంటే టీడీపీకి నలభై లక్షలకు పైగా కార్యకర్తలున్నారని అన్నారు. వారే పార్టీని కాపాడే సైన్యమని చెప్పారు. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఈ మేరకు మీడియా సమావేశంలో కళా వెంకట్రావు మాట్లాడారు. యువనేత లోకేశ్ సాయంతో తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పేపర్ లెస్ సభ్యత్వాన్ని చేపట్టారన్నారు. కాగా, ఏపీలో 75 శాతం రుణమాఫీతో రైతులు లబ్ది పొందారని, రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదనీ అన్నారు. ఇదంతా తమ అధినేత చంద్రబాబు చేసిన కృషి అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News