: తెలుగు రాష్ట్రాల్లో 20, 21 తేదీల్లో పాస్‌ పోర్ట్ మేళా


కొత్తగా పాస్‌ పోర్టు పొందాలనుకునేవారికి సౌలభ్యంగా ఉండేలా ఈ నెల 20, 21 తేదీల్లో పాస్‌ పోర్టు మేళాను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ లోని అమీర్‌పేట, బేగంపేట పాస్‌ పోర్టు సేవా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, నిజామాబాద్ కేంద్రాల్లో కూడా ఈ మేళాలు నిర్వహించనున్నట్లు పాస్‌ పోర్టు అధికారులు వెల్లడించారు. వీటికి అదనంగా, నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోనూ మేళా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కేవలం 300 అపాయింట్‌ మెంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఫీజులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తత్కాల్, నేరుగా మేళాకు వచ్చేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించరని అధికారులు తెలిపారు. www.passportindia.com వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వారు సూచించారు.

  • Loading...

More Telugu News