: ఇద్దరు ఇటాలియన్ మెరైన్ల పిటిషన్లు తిరస్కరించిన సుప్రీం


ఇద్దరు కేరళ మత్స్యకారులను కాల్చి చంపిన కేసులో హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఇటాలియన్ మెరైన్ల పిటిషన్ లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుండె ఆపరేషన్ చేయించుకునేందుకు తనకు రెండు నెలల సమయం కావాలని మస్సిమిలానో లాఠోర్ కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నాడు. అతడి విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు, జనవరి 16, 2015 కల్లా భారత్ తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. అటు క్రిస్మస్ సందర్భంగా తమ దేశం వెళ్లాలనుకుంటున్నానంటూ ప్రస్తుతం భారత్ లో ఉన్న మరో నిందితుడు సాల్వాటోర్ గిరోన్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. ఆరోగ్య కారణాలు చూపి ఆ దేశంలో ఉండేందుకు ప్రతిసారి కారణాలు చూపడం సరికాదని సుప్రీం సూచించింది. ఇటాలియన్ మెరైన్లకు ప్రత్యేక సౌకర్యాలేమి ఉండవని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News