: రావివలస పీఏసీఎస్ సీఈఓపై రైతుల దాడి... గ్రామంలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ముఖ్య కార్యనిర్వహణాధికారిపై రైతులు దాడి చేశారు. అక్రమార్కులు పీఏసీఎస్ లోని రూ.17 కోట్లను బినామీ పేర్లతో కాజేసిన వైనంపై నేడు అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విచారణకు హాజరైన సీఈఓపై రైతులు మూకుమ్మడిగా దాడి చేశారు. పీఏసీఎస్ కార్యాలయం సమీపంలోని పాఠశాలలో దాక్కున్న సీఈఓను బయటకు లాక్కొచ్చి మరీ రైతులు దాడి చేశారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో, గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.