: 2-0 ఆధిక్యానికి ప్రయత్నిస్తామంటున్న ఆసీస్ యువ కెప్టెన్


భారత్, ఆసీస్ జట్లు రెండో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో ఈ మ్యాచ్ రేపు ఆరంభం కానుంది. పిచ్ పేస్ కు అనుకూలించినా భయపడబోమని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేస్తుండగా, 2-0 ఆధిక్యానికి ప్రయత్నిస్తామని ఆసీస్ యువ సారథి స్టీవెన్ స్మిత్ అంటున్నాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ మీడియాతో మాట్లాడుతూ, రెండో టెస్టు ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపాడు. కొన్ని వారాలుగా సాధారణ పిచ్ లపై ఆడిన తమ బౌలర్లు, ఇప్పుడు జీవం తొణికసలాడే గబ్బా పిచ్ పై బౌలింగ్ చేసేందుకు తహతహలాడుతున్నారని స్మిత్ చెప్పుకొచ్చాడు. పిచ్ పై పచ్చిక కారణంగా జట్టులోకి మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్ వుడ్ లను తీసుకువచ్చామని వెల్లడించాడు. అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ నెగ్గిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News