: రుణమాఫీకి సహకరించండి: అధికారులకు ఏపీ సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న రైతుల రుణమాఫీకి అధికారులు సహకరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నేటి ఉదయం ఆయన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీకి అధికారులు సహకరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పిన చంద్రబాబు, ప్రభుత్వ నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెట్టాల్సిన పలు బిల్లులపైనా ఆయన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో పన్నుల వసూళ్ల అంశంపై సమగ్రంగా చర్చించిన చంద్రబాబు, పన్నుల వసూళ్లను మరింత పెంచాలని సూచించారు.