: పాక్ లో తాలిబన్ల దుశ్చర్య... పాఠశాలపై దాడి, 18 మంది మృతి
పాకిస్థాన్ లో తాలిబన్లు మరోమారు దుశ్చర్యకు పాల్పడ్డారు. పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 16 మంది చిన్నారులు సహా 18 మంది మృతి చెందగా, మరో 45 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోకి చొరబడ్డారు. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులకు తెరలేచింది. పాఠశాలలోని 500 మంది విద్యార్థులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే, దాడి చేసింది తామేనని తాలిబన్లు ప్రకటించారు.