: భయపడేది లేదంటున్న ధోనీ
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం పిచ్ విషయంలో భయపడేది లేదంటున్నాడు. అది పేస్ కు సహకరించినా 'నో ప్రాబ్లం' అంటున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం నుంచి జరగనుంది. గాయం నుంచి కోలుకున్న ధోనీ ఈ మ్యాచ్ లో బరిలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో, ధోనీ మీడియాతో మాట్లాడుతూ, గబ్బాలో భారత పేలవ రికార్డు పట్ల తానేమీ ఆందోళన చెందడం లేదన్నాడు. ఈ మైదానంలో భారత్ ఐదు టెస్టులాడినా ఒక్కదాంట్లోనూ నెగ్గలేదు. "గణాంకాలు నిజమే చెబుతున్నాయి, అయితే, జొహాన్నెస్ బర్గ్ కానివ్వండి, డర్బన్ లేక పెర్త్ కానివ్వండి... మేం ఫాస్టెస్ట్ పిచ్ లపైనా నెగ్గాం" అని తెలిపాడు. కుర్రాళ్లకు ఈ మ్యాచ్ కొత్త సవాలని, వారు రాణిస్తారని ఆశిస్తున్నానని అన్నాడు. కాగా, ధోనీ మునుపెన్నడూ బ్రిస్బేన్ లో టెస్టు మ్యాచ్ ఆడలేదు.