: కారుకు పంక్చర్.. ఢిక్కీలో రూ.47 లక్షల అపహరణ
కారు టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి రిపేరు చేయించుకుంటున్న వ్యక్తిని ఏమార్చి.. రూ.47 లక్షలు అపహరించిన సంఘటన నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెం వాసి కుమార్ రాజా అనే వ్యక్తి పలు బ్యాంకుల నుంచి నలభై ఏడు లక్షల రూపాయలను డ్రా చేశాడు. ఆ నగదుతో తణుకు నుంచి తాడేపల్లిగూడెం వెళుతుండగా ఆ వ్యక్తి ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. దీంతో రోడ్డు పక్కన కారు ఆపి టైరుకు పంక్చర్ వేయించుకుంటోన్న సమయంలో కొందరు అగంతకులు ఢిక్కీలో ఉన్న రూ. 47 లక్షలను అపహరించారు. దీంతో, లబోదిబోమన్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ రమేశ్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు.