: గుంటూరు జిల్లాలో ‘రుణమాఫీ’ అధికారుల నిర్బంధం


ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీపై నిన్నటిదాకా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తే, తాజాగా బాధిత రైతులు పథకం వర్తింపుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన నేడు గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. రుణమాఫీ పత్రాలను అందజేసేందుకు వచ్చిన అధికారులను రైతులు నిర్బంధించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో రుణమాఫీకి చాలా మంది రైతులకు అర్హత ఉన్నా, అధికారులు కేవలం ఇద్దరు రైతులకు మాత్రమే రుణమాఫీ పత్రాలను అందజేశారు. దీంతో, నిరసన వ్యక్తం చేసిన గ్రామ రైతులు అధికారులను నిర్బంధించారు.

  • Loading...

More Telugu News