: కింగ్ ఫిషర్ బాటలో స్పైస్ జెట్!


దేశీయ విమానయాన రంగంలో మరో సంస్థ కనుమరుగు కానుంది. ఇప్పటికే నిర్వహణ సమస్యల కారణంగా నిండా అప్పుల్లో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పత్తా లేకుండా పోగా, దాని బాటలోనే స్పైస్ జెట్ పయనిస్తోంది. ప్రస్తుతం రూ.2 వేల కోట్లకు పైగా అప్పులతో స్పైస్ జెట్ సతమతమవుతోంది. మొత్తం 48 విమానాలు కలిగిన స్పైస్ జెట్ ప్రస్తుతం రోజుకు 239 సర్వీసులను నడుపుతోంది. నిర్వహణ లోపం నేపథ్యంలో సెప్టెంబర్ లో రోజుకు 332 సర్వీసులను తిప్పిన స్పైస్ జెట్, కేవలం రెండు నెలల వ్యవధిలోనే వంద మేర సర్వీసులను రద్దు చేయడం గమనార్హం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థిస్తోన్న స్పైస్ జెట్ యాజమాన్యం, లేనిపక్షంలో రోజువారీ కార్యకలాపాలను కూడా నిర్వహించలేమని వాపోతోంది. అయితే స్పైస్ జెట్ కు సంబంధించి ఇప్పటికిప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేమని, ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. అయితే, సంస్థ ప్రస్తుత పరిస్థితిపై నోరువిప్పేందుకు స్పైస్ జెట్ సీఓఓ కపూర్ నిరాకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News