: ఇక దేశీయ విమానయాన రంగంలో టాటా ‘విస్తారా’ సేవలు


దేశీయ విమానయాన రంగంలోకి టాటాలు అడుగుపెట్టేందుకు కార్యరంగం సిద్ధమైంది. 'విస్తారా' పేరిట టాటాల ఆధ్వర్యంలో విమాన సర్వీసులకు డీజీసీఏ అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం రెండు అద్దె విమానాలను కలిగి ఉన్న 'విస్తారా', త్వరలో మరో మూడు విమానాలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. తొలి ఏడాది ముంబై, బెంగళూరు, హైదరాబాద్, గోవా, చండీగఢ్, శ్రీనగర్, జమ్మూ, పాట్నాల మధ్య 'విస్తారా' సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'విస్తారా'లో 51 శాతం వాటా టాటాలది కాగా, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం వాటా ఉంది.

  • Loading...

More Telugu News