: చంద్రబాబు నా పెద్దకొడుకు: తలసాని తల్లి లలితాబాయి
తనకు చంద్రబాబు నాయుడు పెద్దకొడుకు వంటి వాడని, ఆయన తరువాతే శ్రీనివాస్ అని నేడు తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ప్రమాణం చేయనున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లి లలితాబాయి వ్యాఖ్యానించారు. తన కుమారుడికి మంత్రి పదవి రావటం సంతోషంగా ఉందని, ఇదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో విడిపోయినందుకు బాధగా ఉందని ఆమె అన్నారు. కాగా, తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్ ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.