: నేడు ఆసుపత్రి నుంచి రాష్ట్రపతి డిశ్చార్జి... 26న తిరుమలకు రాక
స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. కడుపులో నొప్పి కారణంగా రెండు రోజుల క్రితం ఆయన తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ప్రణబ్ కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఒకరోజు పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారు. దీంతో, ఆదివారం ప్రణబ్ ఆసుపత్రిలోనే ఉండిపోయారు. మూసుకుపోయిన ధమనులను సరిదిద్దే క్రమంలో సోమవారం ప్రణబ్ కు మైనర్ ఆపరేషన్ చేసిన వైద్యులు, ఓ స్టెంట్ ను అమర్చారు. నేడు డిశ్చార్జి కానున్న ఆయన ఈ నెల 26న తిరుమల వెంకన్నను దర్శించుకుంటారని సమాచారం. వెంకన్న దర్శనానంతరం ప్రణబ్ అదే రోజు ఢిల్లీ బయలుదేరనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.