: ఆస్ట్రేలియా ‘దుండగుడు’ ఇరానీ జాతీయుడు షేక్ హరూన్ మోనిశ్
ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో 30 మందిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాది వివరాలు వెల్లడయ్యాయి. ఐఎస్ తరఫున పనిచేస్తున్నాడని భావిస్తున్న అతడిని ఇరాన్ కు చెందిన షేక్ హరూన్ మోనిశ్ గా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. గతంలో ఏడుగురు మహిళలపై అతడు అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఇదిలా ఉంటే నేటి ఉదయం 35 మందిని బందీలుగా పట్టుకున్న అతడితో ఆస్ట్రేలియా పోలీసులు జరిపిన రాజీ చర్చలు విఫలమయ్యాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ను తనతో మాట్లాడించాలని పట్టుబడుతున్న అతడు పోలీసుల విజ్ఞప్తికి ఏమాత్రం సహకరించడం లేదు. దీంతోనే పోలీసులు కేఫ్ లోకి చొరబడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాది నుంచి బందీలను విడిపించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.