: పట్టాదారు పాసుపుస్తకాల జారీ ఆలస్యమైతే అధికారులకు ఫైన్: ఏపీ రెవెన్యూ మంత్రి


రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల జారీలో జాప్యం జరిగితే సంబంధిత అధికారిపై జరిమానా విధించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. నేడు రెవెన్యూ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించిన ఆయన రెవెన్యూ శాఖలో పలు ముఖ్యాంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ పత్రాలు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా సరళీకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం ఓ కమిటీని వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రెవెన్యూ వ్యవహారాల్లో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ కమిటీ తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తుందని ఆయన వెల్లడించారు. ప్రధానంగా రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య కొరవడ్డ సమన్వయ లోపాన్ని నివారించేందుకు కమిటీ కొత్తగా ప్రతిపాదనలు అందజేయనుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News