: ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లవద్దు: అజయ్ జైన్


తమకు కూడా సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ స్పందిస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ నెల 23న కాంట్రాక్ట్ ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లవద్దని జైన్ కోరారు.

  • Loading...

More Telugu News