: రాచకొండలో ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ: తెలంగాణ సీఎం కేసీఆర్


రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల మధ్యన ఉన్న రాచకొండ పరిధిలో ఫిల్మ్ సిటీతో పాటు స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాచకొండ పరిధిలో నేటి మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్, స్పోర్ట్స్ సిటీల ఏర్పాటుకు రాచకొండ అనువైన ప్రదేశమని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఫిల్మ్, స్పోర్ట్స్ సిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. రాచకొండలో దాదాపు 31 వేల ఎకరాల భూమి ఉందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం విద్యాలయాలు, పరిశ్రమలతో పాటు ఇతర సంస్థల ఏర్పాటుకు అత్యంత అనుకూలమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News