: సిడ్నీ ఘటన అమానుషం, దురదృష్టకరం: భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు
సిడ్నీలోని మార్టిన్ కేఫ్ లో 30 మంది అమాయకులను ఉగ్రవాదులు బందీలుగా చేపట్టిన ఘటనను భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, టోనీ అబ్బాట్ లు ఖండించారు. ఈ తరహా ఘటనలు అమానుషమని వారు ఉగ్రవాదుల చర్యలను దునుమాడారు. ‘‘సిడ్నీ ఘటన తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అమానుషం. దురదృష్టకరం. బందీలందరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నా’’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ‘‘ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. శాంతియుతంగా ఉండే ఆస్ట్రేలియాను ఈ తరహా ఘటనలు ఏమీ చేయలేవు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు.