: చక్రి పేరిట సంగీత అకాడెమీ ఏర్పాటు చేయాలి: ఎర్రబెల్లి
అతి తక్కువ సమయంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఎదిగిన చక్రి అకాల మరణం తనను కలచివేసిందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఈ రోజు ఉదయం గుండె పోటు కారణంగా అకాల మరణం చెందిన చక్రి భౌతిక కాయానికి ఎర్రబెల్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో చక్రి పేరిట సంగీత అకాడెమీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన చక్రిని స్మరించుకునేందుకు ఇంతకంటే మించిన మార్గం లేదని ఆయన ప్రభుత్వానికి సూచించారు.