: రాజధాని భూసమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం మళ్లీ సమావేశమైంది. ఉపసంఘం మంత్రులు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రేపు కీలక కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో ఓ రోజు ముందుగా వీరు సమావేశమయ్యారు. సీఆర్ డీఏ బిల్లులో చేయాల్సిన మార్పులపై ఉపసంఘం సభ్యులు చర్చిస్తున్నారు.