: సాయికుమార్ కు జగన్ ఫోన్ లో ఓదార్పు!
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సినీ నటుడు సాయి కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయి కుమార్ తండ్రి పీజే శర్మ ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సాయి కుమార్ కు ఫోన్ చేసిన జగన్, శర్మ మరణం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. కొడుకు పెళ్లి, మరునాడే తండ్రి మరణంతో సాయి కుమార్ కుంగిపోయారు. ఈ నేపథ్యంలో జగన్ ఫోన్ లోనే సాయి కుమార్ ను ఓదార్చారు.