: ఆస్ట్రేలియా బందీల్లో భారత టెక్కీ!: వెంకయ్యనాయుడు


ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో దుండగుడు బందీలుగా పట్టుకున్న వారిలో భారత్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా ఉన్నాడట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ‘‘బందీల్లో మన దేశానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉన్నారని కొంతమేర సమాచారం ఉంది’’ అని వెంకయ్య చెప్పారు. ఇదిలా ఉంటే, దుండగుడు బందీలుగా పట్టుకున్న వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్రధానిని తనతో మాట్లాడించాలని కోరిన దుండగుడు, లేని పక్షంలో సిడ్నీని పేల్చేస్తానని హెచ్చరించాడు. నగరం నాలుగు వైపులా నాలుగు శక్తిమంతమైన బాంబులు పెట్టానని అతడు చెప్పాడు.

  • Loading...

More Telugu News